డ్రగ్స్ ముఠా అరెస్ట్…పోలీసుల అదుపులో ముగ్గురు

ఒకే చోటుమూడు రకాల గంజాయి, డ్రగ్స్‌ అమ్మకాలు జరుపుతున్న ముగ్గురు నిందితుల ముఠాను మంగళవారం ఎక్సైజ్ ఎస్ టి ఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2024-11-26 12:43 GMT

దిశ, కార్వాన్ : ఒకే చోటుమూడు రకాల గంజాయి, డ్రగ్స్‌ అమ్మకాలు జరుపుతున్న ముగ్గురు నిందితుల ముఠాను మంగళవారం ఎక్సైజ్ ఎస్ టి ఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. గోల్కండ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని షేక్‌పేట్‌, టోలీ చౌక్‌ ప్రాంతాల్లో కార్లలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఎస్ టి ఎఫ్ సీఐ చంద్రశేఖర్‌గౌడ్‌ బృందం మంగళవారం తెల్లవారు జామున తనిఖీలు నిర్వహించారు. కాగా పోర్ట్‌కారులో ఒక యువతి, ఒక వ్యక్తి కూర్చోని ఉన్నాగా, మరో వ్యక్తి స్క్రూటి పై వచ్చి గంజాయి ప్యాకెట్‌ను కారులో ఉన్న వ్యక్తులకు ఇస్తూ ఉండగా ఎక్సైజ్‌ ఎస్ టి ఎఫ్ పోలీసులు వారిని పట్టుకున్నారు.

స్కూటీపై వచ్చిన వ్యక్తి నుంచి కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కారులో తనిఖీలు నిర్వహించగా అందులో 1.700 కేజీల గంజాయి, మొత్తంగా 2.700 గంజాయి, 11గ్రాముల ఎండిఎంఎ, 3 ఎల్‌ఎస్‌డీ బాస్ట్స్‌ లభించాయి. వీటి విలువ రూ.1,84,500 ఉంటుందని కారు, స్కూటీ విలువ రూ. రూ. 6,00,000 ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయి డ్రగ్స్‌ అమ్మకాలు జరుపుతూ పట్టుబడిన నిందితుల్లో పి, సాయిబాబా, వై వెంకటరెడ్డి, వి. సోనియా ఎలిషా అలియాస్‌ ప్రియాంకలను అరెస్టు చేసి గోల్కండ ఎక్సైజ్‌ పోలీసులకు అప్పగించారు.


Similar News