ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 3.1 మిలియన్‌ యూనిట్ల కార్ల అమ్మకాలు

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల కొరత కారణంగా..telugu latest news

Update: 2022-04-02 03:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ల కొరత కారణంగా పరిశ్రమ వర్గాలు వినియోగదారుల డిమాండ్‌ను తీర్చడంలో విఫలమైనప్పటికీ, మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా 3.1 మిలియన్ యూనిట్లను విక్రయించాయి. ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 13% మెరుగుదల. టాటా మోటార్స్, స్కోడాతో సహా పలు వాహన తయారీ సంస్థల గత సంవత్సరం అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయి. అయితే మొత్తం పరిశ్రమ అమ్మకాలు FY19లో నమోదైన 3.3 మిలియన్ యూనిట్ల గరిష్ట అమ్మకాల కంటే వెనుకబడి ఉన్నాయి. వినియోగదారుల నుంచి డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ సెమీకండక్టర్ల కొరత, సరఫరా సమస్యల వలన డెలివరీలు ఆలస్యం అయినట్లు మారుతీ సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ మీడియాకి తెలిపారు.

మారుతీ సుజుకి FY22లో కేవలం 1.3 మిలియన్ యూనిట్లను విక్రయించింది. దాని మార్కెట్ వాటాలో 50% నుండి 43.4%కి పడిపోయింది. ఇంధన ధరల పెరుగుదల కారణంగా మారుతి సుజుకి అమ్మకాలలో ఎక్కువ భాగం చిన్న, ఎంట్రీ-లెవల్ కార్ల అమ్మకాలు ప్రభావితమయ్యాయి. టాటా మోటార్స్ FY22లో అత్యధిక వార్షిక అమ్మకాలను నమోదు చేసి, 12% మెరుగైన మార్కెట్ వాటాతో మూడవ-అతిపెద్ద వాహన తయారీదారుగా తన స్థానాన్ని తిరిగి పొందింది. టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, ఐషర్ మోటార్స్, మహీంద్రా వాహనాల విక్రయాలు సంవత్సరానికి 27.4% వృద్దితో FY22లో 664,009 యూనిట్లకు చేరుకున్నాయి. వీటిలో ట్రక్కులు, బస్సులు, చిన్న CVలు ఉన్నాయి.

Tags:    

Similar News