ఆఖరి నెలలో హడావిడిగా నిధుల ఖర్చు.. అనుమానం వ్యక్తం చేసిన 'కాగ్'

దిశ, తెలంగాణ బ్యూరో: హడావుడి నిధుల వినియోగాన్ని కాగ్​నివేదిక తప్పుబట్టింది. ఏడాది మొత్తం ఖర్చు చేయకుండా, తక్కువ ఖర్చు చేసి ఆర్థిక సంవత్సరం ఆఖరి నెలలోనే ఖర్చు పెడుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

Update: 2022-03-24 01:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హడావుడి నిధుల వినియోగాన్ని కాగ్​నివేదిక తప్పుబట్టింది. ఏడాది మొత్తం ఖర్చు చేయకుండా, తక్కువ ఖర్చు చేసి ఆర్థిక సంవత్సరం ఆఖరి నెలలోనే ఖర్చు పెడుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒకే నెలలో సగటున 40 శాతం నిధులు వెచ్చిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేసింది. ఇలా నిధులను వ్యయం చేస్తే దుర్వినియోగానికి ఆస్కారం ఉంటుందని కాగ్​నివేదికల్లో వెల్లడించింది. ఆర్థిక నిర్వహణలో క్రమబద్దకమైన వేగం ఉండాలని, అంతేకానీ ఒకేసారి వెచ్చించడం సరికాదని సూచించింది.

కీలక శాఖల్లోనూ అలాగే!

ఈ సందర్భంగా కాగ్ పలు శాఖలను ఉదహరించింది. కీలకమైన శాఖల్లో ఆఖరి త్రైమాసికం.. అందులోనూ ఆఖరి నెలలో ఖర్చు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సామాజిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, ఇంధన శాఖకు కేటాయించిన గ్రాంట్లు మార్చి నెలలో ఎక్కువగా వ్యయంగా ఉందని, ఇలా అధిక వ్యయానికి కొవిడ్‌ను గత రెండేండ్లు కారణంగా చూపించారంటూ నివేదికల్లో వెల్లడించింది. అయితే, ఇలాంటి కారణాలను చూపించడం కరెక్ట్​కాదని, వరుసగా నాలుగైదేండ్ల నుంచి ఇదే తరహాలో మార్చి నెలలోనే వ్యయం అధికంగా ఉంటుందని అభిప్రాయపడింది. గృహ నిర్మాణానికి 2020 నాటికి మొత్తం రూ.1450 కోట్లు ఖర్చు చూపిస్తే ఆఖరి త్రైమాసికంలోని మార్చిలో రూ.702 కోట్లు ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. అదే విధంగా గిరిజన సంక్షేమంలో మొత్తం రూ.6081 కోట్లు వెచ్చిస్తే మార్చి నెలలోనే రూ.1369 కోట్లు ఖర్చు పెట్టారని, సామాజిక సంక్షేమంలో రూ.9056 కోట్లు వెచ్చిస్తే ఆర్థిక సంవత్సరం చివరి నెల మార్చిలో రూ.2170 కోట్లు ఖర్చు పెట్టారని, ఇంధన శాఖలో రూ.6339 కోట్లు ఖర్చు చేస్తే మార్చిలో రూ.1686 కోట్లు ఖర్చు పెట్టడాన్ని కాగ్​తప్పు పట్టింది.

ఇక, కొన్ని పథకాలకు కూడా ఫైనాన్సియల్ ఇయర్ చివరి నెలలో ఖర్చు పెట్టడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కీలకమైన పథకాలకు ఆఖరి నెలలో అత్యధికంగా ఎలా ఖర్చు పెట్టుతారని, ఇది దుర్వినియోగానికి దారి తీస్తుందని కాగ్​హెచ్చరించింది. ఏడాది మెత్తంగా పథకాలకు ఖర్చు చేయకుండా ఒకేసారి చివరి నెలలో ఎలా వెచ్చిస్తారని అనుమానాలు వ్యక్తం చేసింది. అంతేకాకుండా గురుకులాలు, బియ్యం రాయితీ, మిషన్​ కాకతీయ వంటి స్కీంలకు ఆఖరి నెలలో వెచ్చించడాన్ని కాగ్​ అభ్యంతరం వ్యక్తం చేసింది.

కాగ్​ ఎత్తి చూపిన పలు శాఖల్లోని పథకాలకు మార్చి నెల ఖర్చులు

పథకం                                             మార్చి నెలలో వెచ్చించిన సొమ్ము (కోట్లల్లో)

అమృత్​                                             291.03

బియ్యం మీద రాయితీ                       606.86

ఉపాధి వేతనాలు                               253.09

మైనార్టీ ఆశ్రమ పాఠశాలలు,
 వసతి గృహాలు                                  389.77

ఐసీడీఎస్​                                           454.57

రైతుల రుణ ఉపశమన పథకం          700.00

నీటి వనరుల మౌలిక వసతుల అభివృద్ధి - 361.24

మిషన్​ కాకతీయ                                 595.57

Tags:    

Similar News