చెల్లెలు ఫ్రెండ్‌పై యువకుడు అత్యాచారం.. ఆమె sex వీడియోలను చూపిస్తూ మరో ఏడుగురు..
దిశ,వెబ్ డెస్క్: మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం..latest telugu news
దిశ,వెబ్ డెస్క్: మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా కొందరి కామాంధుల చేతిలో వారు బలైపోతున్నారు. అలాంటి మరో భయంకరమైన సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. 20 ఏళ్ల యువకుడు, అతని 5 మంది స్నేహితులు మరో ఇద్దరు మైనర్లతో కలిసి 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు. అంతేకాకుండా ఆమెపై లైంగిక వేధింపులకు, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన అనంతరం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. గత సంవత్సరం అక్టోబర్‌లో బాధితురాలు తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అయితే తన స్నేహితురాలు అక్కడ లేదు. ఇదే క్రమంలో ఇంట్లో ఒంటరిగా వున్న స్నేహితురాలి అన్నయ్య బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా తన మొబైల్ ఫోన్‌లో ఆ నేరాన్ని రికార్డ్ చేశాడు. ఈ వీడియోలను ఇతర నిందితులకు కూడా షేర్ చేశాడు. దీంతో వారు కూడా మైనర్ బాలికను లైంగికంగా వేధిస్తూ వచ్చారు. అంతేకాకుండా ఆమె నుండి డబ్బులు వసూలు చేయడానికి కూడా నిందితులు ప్రయత్నించారు.
ఈ ఘటనతో బాధితురాలి డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఇదే క్రమంలో బాధితురాలి తల్లి ఆమె ప్రవర్తనలో మార్పులు గమనించింది. రోజులు గడుస్తున్న ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో ఆ అమ్మాయిని ప్రశ్నించింది. మొదట, ఆమె తనపై జరిగిన నేరాన్ని తల్లికి చెప్పడానికి నిరాకరించింది. అయితే, పదేపదే ప్రశ్నించడంతో తనపై జరిగిన ఘోరాన్ని తల్లికి వివరించింది. దీంతో ఏప్రిల్ 6న నిందితుడిపై బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది.
విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎనిమిది మంది నిందితులపై పోక్సో చట్టం, ఐపీసీ సెక్షన్ 376 (రేప్) కింద కేసు నమోదు చేశారు. అయితే మరో ఇద్దరు కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.