జైలు నుంచి బెయిల్‌పై వచ్చి మూడో పెళ్లి చేసుకున్న నటుడు.. ఫొటోలు వైరల్

మలయాళ నటుడు బాల(Balakumar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-10-23 14:00 GMT

దిశ, సినిమా: మలయాళ నటుడు బాల(Balakumar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ‘కంగువ’ సినిమా డైరెక్టర్ శివ(Shiva)కు తమ్ముడు అవుతాడని సమాచారం. అయితే ఇటీవల ఆయన భార్య అమృత సురేష్(Amrutha Suresh)తనతో పాటు తన కూతురు అవంతికను వేధించాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాల(Balakumar)ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అయితే అరెస్ట్ అయిన 24 గంటల్లోనే బెయిల్‌పై బయటకు వచ్చాడు. తాజాగా, బాల మూడో పెళ్లి చేసుకుని అందరినీ షాక్‌కు గురి చేశాడు. తమిళనాడుకు చెందిన తన బంధువు కోకిల(Kokila)తో ఏడు అడుగులు వేసి బాల కేరళలోని కల్లూరు పావకులం ఆలయానికి వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలు విషయం బయటకు వచ్చింది.

కాగా, బాల 2010లో అమృత సురేష్‌(Amrutha Suresh)ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కూతురు కూడా ఉంది. కానీ కొద్ది కాలానికి మనస్పర్థలు రావడంతో 2019లో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత 2021లో ఎలిజబెత్ ఉదయన్‌ను బాల రెండోసారి పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్లకే 2023లో విడాకులు ఇచ్చాడు. ఈ నేపథ్యంలో బాల మొదటి భార్య తాను విడాకులు తీసుకున్నప్పటికీ వేధిస్తున్నాడు ఫిర్యాదు చేయడంతో వీరి వ్యవహారం గత కొద్ది రోజుల నుంచి నెట్టింట వైరల్‌గా మారింది.

 

Tags:    

Similar News