ఆ దర్శకుడి చేతిలో దెబ్బలు తిన్నా.. ధనుష్ సంచలన వ్యాఖ్యలు
దిశ, సినిమా : సినిమాల్లో హీరోగా రాణించేందుకు మంచి కలర్, గుడ్ పర్సనాలిటీ అవసరం లేదు. కేవలం టాలెంట్ ఉంటే చాలని నిరూపించిన వారిలో ధనుష్ ఒకరు.
దిశ, సినిమా : సినిమాల్లో హీరోగా రాణించేందుకు మంచి కలర్, గుడ్ పర్సనాలిటీ అవసరం లేదు. కేవలం టాలెంట్ ఉంటే చాలని నిరూపించిన వారిలో ధనుష్ ఒకరు. పదహారేళ్ల వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చిన ధనుష్.. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటే.. తన కెరీర్‌లో జరిగిన ఒక సంఘటన గురించి లేటెస్ట్ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు ధనుష్. మంచి నటన రాబట్టేందుకు తన సోదరుడు, డైరెక్టర్ అయిన సెల్వ రాఘవన్ కొట్టేవాడని వెల్లడించాడు. ఆ రోజు ఆయన కొట్టడం వల్లే తనను ఇంత మంది ప్రేక్షకులు ఆదరిస్తున్నారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ చేస్తున్న 'సార్' సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానుంది. ధనుష్ లెక్చరర్‌గా కనిపిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.