Rubina Dilaik: నా శారీరక రూపమే కావాలా?.. అవమానం తట్టుకోలేకపోతున్నా..

దిశ, సినిమా: ప్రముఖ టెలివిజన్ నటి 'బిగ్ బాస్ 14' విజేత రుబీనా దిలైక్ ఈ మధ్య జానాల మాటలు అర్థంకాక గందరగోళంగా ఉందంటోంది.

Update: 2022-04-16 09:46 GMT

దిశ, సినిమా: ప్రముఖ టెలివిజన్ నటి 'బిగ్ బాస్ 14' విజేత రుబీనా దిలైక్ ఈ మధ్య జానాల మాటలు అర్థంకాక గందరగోళంగా ఉందంటోంది. ఇటీవల కొంతమంది ఫొటోగ్రాఫర్లు తనను 'ఆప్ యాక్టర్ హో?' అని అడిగారన్న బ్యూటీ.. తనను కావాలనే అవమానిస్తున్న వారిని నకిలీ అభిమానులుగా పేర్కొంది. 'కొందరు మొదటగా ఫొటోలు తీసీ ఆ తర్వాత మేడమ్ మీరు ఏ సీరియల్‌లో నటించారు? మీరు నటులా? అని అడిగారు. ఇది అభినందన లేదా అవమానమా అని తేల్చుకోలేక గందరగోళానికి గురవుతున్నాను' అని చెప్పింది. అలాగే గత సంవత్సరం వెయిట్ పెరిగితే ట్రోల్ చేయడం ప్రారంభించారన్న ఆమె.. 'ప్రియమైన శ్రేయోభిలాషులారా నేను బరువు పెరగడం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని గమనించాను. అయితే మీరు నామీద కనికరం లేకుండా ద్వేషపూరితమైన సందేశాలు పంపుతున్నారు. నిజంగా నిరాశ చెందాను. మీకు నా ప్రతిభ, పని నిబద్ధత కంటే నా శారీరక రూపమే చాలా ముఖ్యం. కానీ మీ అందరికీ ఒకటి చెప్పాలి. ఇది నా జీవితం. దానికి అనేక దశలున్నాయి. మీరు కూడా నా జీవితంలో ఒక భాగమే. నా నిజమైన ఫ్యాన్స్‌ను గౌరవిస్తాను. కానీ, నెగెటివ్ కామెంట్స్ చేసేవారు నా అభిమానిగా ఊహించుకోవద్దు' అని వివరించింది.

Tags:    

Similar News