మద్యంపై టీడీపీ పోరుబాట.. నేడు, రేపు రాష్ట్రవ్యాప్త నిరసనలు

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో కల్తీ సారా అరికట్టాలని, జే బ్రాండ్స్ మద్యం నిషేధించాలని టీడీపీ పిలుపునిచ్చింది.

Update: 2022-03-19 03:02 GMT

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో కల్తీ సారా అరికట్టాలని, జే బ్రాండ్స్ మద్యం నిషేధించాలని టీడీపీ పిలుపునిచ్చింది. శని, ఆదివారాల్లో రెండు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. శుక్రవారం పార్టీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు టెలీ‌కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. '' సీఎం వైఎస్ జగన్ ధనదాహంతో మహిళల తాలిబొట్లు తెంచుతున్నాడు. దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్లు రాష్ట్రంలోనే ఎందుకు ఉన్నాయి?. నేడు రేపు రాష్ట్ర వ్యాప్త నిరసనలతో మద్యంపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. మద్యంపై ప్రభుత్వ విధానాలను పార్టీ నేతలు ప్రజలతో కలుపుకొని ఎండగట్టాలి. తన కమీషన్ల కోసం సీఎం వైఎస్ జగన్ సొంత బ్రాండ్స్ తెచ్చి, నాణ్యత లేని మద్యం విక్రయించి ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు. జగన్ బ్రాండ్లు స్లో పాయిజన్‌. రూ.60 ఉండే మద్యం బాటిల్ రేటును రూ.120-150 చేసి ప్రజలను దోచుకుంటున్నారు. తన సొంత బ్రాండ్ల ద్వారా జగన్ ఏడాదికి ప్రజల జేబుల నుంచి రూ.5 వేల కోట్లు కాజేస్తున్నాడు. 5 ఏళ్లలో ఒక్క మద్యం ద్వారానే కమీషన్ల రూపంలో జగన్ రూ.25-30 వేల కోట్లు ఆర్జించనున్నా. జంగారెడ్డి గూడెంలో 27 మంది కల్తీ సారా వల్ల చనిపోతే..వాటిని సహజ మరణాలు అని సీఎం జగన్ చెప్పాడు. టీడీపీ హయాంలో నిఘా కోసం పెగాసస్ కొనలేదు అనే విషయాలు కూడా ఇప్పుడు ఆధారాలతో బయట పడ్డాయి. అసత్య ప్రచారాలు చేసిన జగన్‌ను, వైసీపీ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీయాలి' అని చంద్రబాబు కేడర్‌కు పిలుపునిచ్చారు.

Tags:    

Similar News