SURYA 45: 'సూర్య 45' అనౌన్స్‌మెంట్.. హైప్ పెంచేస్తున్న పోస్టర్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అందులో భాగంగా సూర్య నటిస్తున్న తాజా మూవీ ‘సూర్య 45’. మూకుతి అమ్మన్, వీట్ల విశేషం వంటి హిలేరియస్, సోషల్ రెస్పాన్సిబులిటీ కలిగిన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆర్జే బాలాజీ ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇక ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై ఎస్‌ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్ ప్రభు ఈ మూవీని నిర్మించనున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్.. 'సూర్య 45' (Surya 45)మూవీని పూజా కార్యక్రమంతో ప్రారంభించింది. అందుకు సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ఈ మూవీపై హైప్ పెంచేస్తోంది. కాగా AR రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని.. 2024 నవంబర్‌లో సెట్స్‌పైకి తీసుకువెళ్లి 2025 సెకండ్ హాఫ్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Thrilled! #Suriya45 @RJ_Balaji @arrahman @prabhu_sr @DreamWarriorpic pic.twitter.com/Gjfm0R0mKT
— Suriya Sivakumar (@Suriya_offl) October 14, 2024
(VIDEO LINK CREDITS TO SURIYA SIVAKUMAR X ACCOUNT)