బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు
సాధారణ పౌరులు, ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేదాజ్ఞలను ఈ నెల 31 వరకు పొడిగించినట్టు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి తెలిపారు.
దిశ, కరీంనగర్ రూరల్ : సాధారణ పౌరులు, ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేదాజ్ఞలను ఈ నెల 31 వరకు పొడిగించినట్టు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మొహంతి తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారి ఆగడాలపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు.
మద్యం సేవించి మద్యం ప్రియులు వీధుల్లో, రోడ్లపై అసభ్యపదజాలంతో మాట్లాడుతుడటం, అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందిగా పరిణమించిందన్నారు. మద్యంప్రియుల ఆగడాలకు కళ్లెం వేయడంతోపాటు ప్రజల భద్రత, రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని అన్నారు. పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఈ కాల పరిమితి పొడిగించే అవకాశం ఉందన్నారు. నిషేదాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.