ప్రభాస్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. డార్లింగ్ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఆ బ్లాక్ బస్టర్ మూవీ స్పెషల్ షోలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అందరికీ సుపరిచితమే. రీసెంట్‌గా వచ్చిన ‘కల్కీ2898ఏడీ’ మూవీతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

Update: 2024-10-16 04:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అందరికీ సుపరిచితమే. రీసెంట్‌గా వచ్చిన ‘కల్కీ 2898ఏడీ’ మూవీతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం రాజా సాబ్, స్పిరిట్, సలార్ 2, కల్కీ 2, ఫౌజీ వంటి వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే, అక్టోబర్23న రెబల్ స్టార్ బర్త్‌డే అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన నటించిన సినిమాలను రీ రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేశారు. అందులో భాగంగా 2010లో రిలీజ్ అయి ప్రభాస్ కెరీర్‌ను మలుపు తిప్పిన ‘డార్లింగ్’ మూవీను రీ- రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.

అలాగే డార్లింగ్ ఫస్ట్ మూవీ అయిన ‘ఈశ్వర్’ కూడా రీ- రిలీజ్ కానుంది. ఇక 2002లో ఈ చిత్రం కూడా హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. డార్లింగ్, ఈశ్వర్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయని తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో డార్లింగ్ ఫ్యాన్స్‌కు మరో సూపర్ న్యూస్.. అదేంటంటే.. ఇటీవల రిలీజ్ అయి భారీ హిట్ అందుకున్న ‘సలార్’ మూవీను కూడా ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ షోలు వేయనున్నట్లు తెలుస్తోంది. ఇక విషయం తెలుసుకున్న రెబల్ స్టార్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.


Similar News