సన్ రైజర్స్ హైదరాబాద్ ఆంథమ్ సాంగ్ రిలీజ్
హైదరాబాద్: ఐపీఎల్ సీజన్ -15లో భాగంగా - Sunrisers Hyderabad Anthem Song Release
హైదరాబాద్: ఐపీఎల్ సీజన్ -15లో భాగంగా సన్‌రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ యాజమాన్యం మరో సూపర్ ఆంథమ్‌ను తీసుకొచ్చింది. 'ఆరెంజ్ ఆర్మీ రెడీ టు రైజ్ అనే శీర్షిక'తో మాస్ సాంగ్‌ను లాంచ్ చేసింది. ఇప్పటికే జట్టుకు సంబంధించిన జెర్సీని రూపొందించిన ఎస్ఆర్‌హెచ్ యాజమాన్యం సరికొత్తగా సాంగ్‌ను రికార్డింగ్ చేయించి సోమవారం రిలీజ్ చేసింది. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ రూపొందించిన మాస్ ఆంథమ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. సాంగ్ మేకింగ్‌లో భాగంగా చార్మినార్‌తో పాటు హైదరాబాద్ విశేషాలు, వింతలను చూపించారు.
గట్టి గట్టిగా కప్పుకొట్టాలి అనే లిరిక్స్‌తో సాంగ్ ఫ్యాన్స్ ముందుకొచ్చింది. ఓవైపు జట్టు క్రీడాకారులు ప్రాక్టీస్ చేస్తున్న దృశ్యాలతో పాటు ఫన్నీ దృశ్యాలను ఇందులో చూడొచ్చు. కాగా, మంగళవారం మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా సాయంత్రం 7.30 గంటలకు సన్ రైజర్స్ జట్టు రాజస్థాన్ రాయల్స్‌తో తొలిమ్యాచ్ ఆడనుంది. ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్ జట్టుకు న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్ సన్ సారథిగా వ్యవహరించనున్న విషయం తెలిసిందే.