"మనల్ని ఎవడ్రా ఆపేది" అంటున్న.. సన్‌రైజర్స్ ఫ్యాన్స్
దిశ, వెబ్‌డెస్క్: సద్దా పంజాబ్, విజిల్ పొడు, హల్లా బోల్.. - Sunrise Hyderabad team tagline Pawan Kalyan dialogue in the movie 'Bhimla Nayak'
దిశ, వెబ్‌డెస్క్: సద్దా పంజాబ్, విజిల్ పొడు, హల్లా బోల్.. ఇలా ఐపీఎల్‌లో ఫ్రాంచైజీలు తాము ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్రాల భాషలో వివిధ క్యాచీ ట్యాగ్‌లైన్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. కానీ సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం ఈ విధంగా ఆలోచించలేకపోయింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో తెలుగులో పోస్ట్‌లు పెట్టడం మెుదలెట్టింది. టాలీవుడ్ హీరోలకు సంబంధించిన సాంగ్స్, డైలాగ్స్ చెప్పిస్తూ.. ఫ్యాన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇంకా జట్టుకు తెలుగు ట్యాగ్‌లైన్ మాత్రం ప్రకంటించలేకపోయింది.
చెన్నై సూపర్ కింగ్స్ 'విజిల్ పొడు', ఆర్‌సీబీ 'ఈ సాల కప్ నమ్దే' .. ట్యాగ్‌లైన్స్ ఎంత పాపులర్ అయ్యాయే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పటి వరకు సన్‌రైజర్స్ జట్టు గోగోగో ఆరెంజ్ ఆర్మీ అనే ఇంగ్లీష్ స్లోగన్‌తో ప్రారంభంలో కొంత సందడి చేసింది. ప్రస్తుతం ఆరెంజ్ ఆర్మీ అనే ట్యాగ్‌లైన్‌తో కొనసాగుతుంది. అయితే సోషల్ మీడియాలో ఎన్నో రకాల తెలుగు స్లొగన్ కోసం ప్రయత్నాలు జరిగాయి. కానీ సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ తెలుగు ట్యాగ్‌లైన్ విషయాన్ని పట్టించుకోలేదు.
దీనిపై ప్రముఖ తెలుగు క్రికెట్ అనలిస్ట్ సీ. వెంకటేశ్ సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌కు కొన్ని ఆప్సన్స్ ఇచ్చి.. వారి అభిప్రాయాలను కోరాడు. ఫ్యాన్స్ అందరూ.. 'మనల్ని ఎవడ్రా ఆపేది' అనే ట్యాగ్‌లైన్‌కు ఓటేయడంతో.. దాన్ని సన్‌రైజర్స్ ట్యాగ్‌లైన్‌గా ప్రకటించారు. ఈ ట్యాగ్‌లైన్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమాలోని డైలాగ్ కావడంతో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ దీనికి మద్దతు తెలుపుతున్నారు.
SRH టీమ్‌కి తెలుగులో ఓ పంచ్ లైన్ ఉంటే బాగుంటుందని నేను అడగడం మీకు తెలుసు. వచ్చిన స్లోగన్లలో ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో "మనల్ని ఎవడ్రా ఆపేది"కే ఓటు వేశారు. దానికే ఫిక్సవుదాం, సరేనా...@srhfansofficial@SunrisersFreaks@SunRisersC@IPL_Teams@Sunrisers_FC_@SunrisersCorps@SunrisersFC pic.twitter.com/6nRDkKn2lJ
— C.VENKATESH (@C4CRICVENKATESH) March 22, 2022
డియర్ ఫ్యాన్స్, SRH గురించి పోస్టులు పెట్టేడప్పుడు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి అన్ని సోషల్ మీడియాల్లో #మనల్నిఎవడ్రాఅపేది అన్న లైను వాడుతూ టీమ్‌కి కొంతయినా తెలుగుదనం అద్దే ప్రయత్నం చేద్దామని నా విన్నపం.#మనల్నిఎవడ్రాఅపేది
— C.VENKATESH (@C4CRICVENKATESH) March 22, 2022