Summer Health tips: వడదెబ్బ నుంచి కాపాడుకోవాలా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

దిశ, వెబ్‌డెస్క్ : వేసవికాలం వచ్చిందంటే చాలు చాలామంది డీ హైడ్రేట్‌కు గురవుతుంటారు.

Update: 2022-04-20 03:27 GMT

దిశ, వెబ్‌డెస్క్ : వేసవికాలం వచ్చిందంటే చాలు చాలామంది డీ హైడ్రేట్‌కు గురవుతుంటారు. ఎండవేడికి శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి తల తిరగడం లాంటి సమస్యలు వస్తుంటాయి. ఇక ప్రస్తుతం భానుడు తన ప్రతాపం చూపెడుతున్నాడు. క్రమంలో ఎవరైనా బయటకు వెళ్తే చాలు వడదెబ్బకు బలి కావాల్సిందే. అయితే ఈ వడదెబ్బ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే తినాల్సి ఆహార పదార్థాలు ఏంటో చూద్దాం.

మజ్జిగ లేదా పెరుగు : వేసవిలో శరీరానికి చల్లదంనం అందిచడంలో మజ్జిగ చాలా ఉపయోగ పడుతుంది. అందువలన రోజు మజ్జిగ తాగడం వలన వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి వాటివలన మజ్జిగ లేదా పెరుగు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. బయటకు వెళ్లే సమయంలో బాటిల్‌లో మజ్జిగ తీసుకెళ్లడం మంచిది.

కొబ్బరి నీళ్లు : కొబ్బరి నీళ్ళు శరీరానికి ఎంతో మంచిది.దీన్ని తీసుకోవడం వల్ల దాహం తీరడమే కాకుండా శరీరానికి చల్లదనాన్ని అందిస్తోంది.

నిమ్మకాయ : వేసవిలో నిమ్మకాయ రసం తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.శరీరంలో వేడిని తగ్గించడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది.

పుచ్చకాయ : పుచ్చకాయ మంచి నీటి వనరుగా పరిగణిస్తారు. పుచ్చకాయలో 90 శాతం నీరు ఉంటుంది. ఇది మీ శరీరాన్ని ,చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది.

Tags:    

Similar News