దిశ, అల్వాల్: తీవ్ర మానసిక ఒత్తిడితో ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం రాత్రి అల్వాల్ పోలీస్‌స్టేషన్‌పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదేవి నగర్‌కు చెందిన లత కూతురు రేవతి(28)కి మల్కాజిగిరిలోని గౌతంనగర్‌కు చెందిన కిరణ్‌తో గత సంవత్సరం అక్టోబర్‌లో వివాహం అయింది. గత కొంతకాలంగా రేవతి తల్లి లతకు తీవ్రమైన ఆనారోగ్యంతో బాధపడుతుంది. దీంతో చికిత్సపొందుతున్న తల్లిని చూడడానికి రేవతి గత 16న భూదేవి నగర్‌లోని తల్లిగారింటికి వచ్చింది.
తల్లి ఆరోగ్య పరిస్థితిని చూసి జీర్ణించుకోలేక రేవతి తీవ్ర మానసిక వేదనకు గురై ఇంట్లోకి వెళ్లింది. ఎంతసేపయిన బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన బంధువులు తలుపు తట్టినా అలికిడి కాకపోవడంతో స్థానికుల సహాయంతో ఇంటి తలుపులు తెరచి చూడగా అప్పటికే రేవతి చున్నితో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.