సాగర్ కాల్వలో‌కి దూకి.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం

Update: 2022-03-21 09:34 GMT

దిశ,హాలియ : ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన  స్థానికంగా కలకలం సృష్టించింది.  హాలియా పట్టణంలోని సాగర్ ఎడమ కాలువ నందు ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య యత్నం చేశారు. అందులో ప్రేమికుడు గల్లంతు అవ్వగా ప్రేమికురాలిని పోలీసులు, స్థానికులు కాపాడారు. ప్రియుడు మాచర్లకు చెందిన బాలా కృష్ణగా పోలీసులు గుర్తించారు. ప్రియురాలు పీఏ పల్లి మండలానికి చెందినట్లు తెలుస్తుంది. ఇక ఈ ఘటనలో ప్రియుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు . వార్తకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News