కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ రెగ్యులరైజ్ చేయండి.. మంత్రికి వినతి పత్రం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని - Submission of petition to Education Minister Sabita to regularize all contract faculty
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులందరినీ రెగ్యులరైజ్ చేయాలని యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల జేఏసీ చైర్మన్ రమేశ్రావు మాట్లాడుతూ.. చాలా ఏండ్లుగా తాము వర్సిటీల్లో విధులు నిర్వర్తిస్తున్నామని, తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నట్లు చెప్పారు. ఉద్యమ సమయంలో ముందు వరుసలో ఉన్న వర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల అందరినీ క్రమబద్ధీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.
2015లో ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సర్క్యులర్ జారీ చేసినా, ఇప్పటి వరకు రెగ్యులరైజేషన్ చేపట్టలేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. కాగా మంత్రి ఈ అంశంపై పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. మంత్రి సబిత కు వినతి అందజేసిన వారిలో జేఏసీ కన్వీనర్శ్రీధర్, కమల్నాథ్, పలు వర్సిటీల నాయకులు నారాయణ గుప్త, వెంకటేశ్వర్లు, విజేందర్, శ్రీనివాస్, శరత్, సోమేశ్, ప్రేమ్, నాగేంద్ర బాబు తదితరులు ఉన్నారు.