బాసర ట్రిపుల్ ఐటీ మెస్ సిబ్బందిపై విద్యార్థులు ఆగ్రహం

దిశ, ముధోల్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలో - Students angry over Basara triple IT mess staff

Update: 2022-03-10 17:24 GMT

దిశ, ముధోల్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలో మెస్ సిబ్బందిపై విద్యార్థులు ఆగ్రహానికి గురవుతున్నారు. గురువారం రాత్రి వడ్డించిన ఆహారంలో మళ్లీ పురుగులు రావడంతో వి వాంట్ జస్టిస్ అంటూ..! మెస్ సిబ్బందిపై మండిపడుతున్నారు. గత వారం రోజుల కిందనే వరుసగా ఓ రోజు కప్ప, తోక పురుగు రావడంతో విద్యార్థులు పలు సామాజిక మాధ్యమాలు వాటి ఫోటోలు దించి, పోస్టులు పెట్టి హల్చల్ చేయగా.. ఇట్టి ఘటనను పలు వీడియాలు సైతం ప్రచారం చేశారు. అధికార యంత్రాంగం మొన్న సోమవారం కదిలి, అక్కడ గల మెస్ పరిసరాలను, ఆహార పదార్థాలను పరిశీలించారు. అక్కడ సిబ్బంది పై మండిపడ్డారు, తప్పిదం పై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయినా తంతు మారకుండా అధికార యంత్రాంగం వచ్చి మళ్లీ నాలుగు రోజులు గడవక ముందే ఇంకా ఆహారం లో పురుగులు, కీటకాలు వచ్చాయంటూ విద్యార్థులు నిరసిస్తూ..! భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. వి వాంట్ జస్టిస్ అంటూ అరుపులతో అక్కడ ప్రాంగణంలో ఉన్న వారికి మొత్తం వినబడేలా అరిచారు.

Tags:    

Similar News