Anil Ravipudi: ఒక్క సినిమా ప్లాప్ అయినా పాతాళానికే.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్
యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి (Anil Ravipudi) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
దిశ, సినిమా: యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడి (Anil Ravipudi) ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘పటాస్’, సుప్రీమ్, రాజాది గ్రేట్, ఎఫ్-2, భగవంత్ కేసరి వంటి సినిమాలతో వరుస హిట్స్ అందుకుని స్టార్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న ఈయన.. త్వరలో ‘సంక్రాంతి వస్తున్నాం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు చిత్ర బృందం.
ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనీల్ రావిపూడి సినిమాల హిట్స్, ప్లాప్స్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘బ్యాక్ టు బ్యాక్ ఎన్ని సక్సెస్‌లు అందుకున్న ఒక్క ప్లాప్ వచ్చిందంటే ఆ డైరెక్టర్ పాతాళినికి పడిపోవాల్సిందే. ఇంక ఆ డైరెక్టర్ వైపు హీరోలు, నిర్మాతలు చూసే పరిస్థితి ఉండదు. ఇక్కడ హిట్స్ ఉంటేనే అవకాశాలు. లేదంటే.. దుకాణం సర్ధుకుని వెళ్లిపోవాల్సిందే. ఇండస్ట్రీలో ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేం. ఇది సెక్యూర్ లేని లైఫ్.. ఫాంలో ఉన్నంత వరకు సినిమాలు చేసుకుంటూ వెళ్లడమే. అంతేకానీ అది పోయాక అవకాశాలు రాలేదని బాధపడకూడదు’ అని చెప్పుకొచ్చారు.