వీటిని రూ. లక్షలు పెట్టి కొనేందుకు కూడా వెనుకాడరు.. అయినా దొరకవు!
దిశ, వెబ్ డెస్క్: శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఇవాళ భద్రాచలంలో..Special Story Of Badhrachalam Ramulori Kalyana Beams
దిశ, వెబ్ డెస్క్: శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఇవాళ భద్రాచలంలో రాములోరి కళ్యాణమహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారు. అదేవిధంగా ప్రముఖులు కూడా రాములోరి కళ్యాణ మహోత్సవానికి హాజరవుతారు. అయితే, రాములోరి కళ్యాణ మహోత్సవం తర్వాత తలంబ్రాల కోసం భక్తు ఎగబడుతుంటారు. రూ. లక్షలు ఖర్చు చేసి వాటిని పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. అయినా కూడా అవి చాలా మందికి దొరకవు. ఎందుకంటే.. రాములోరి కళ్యాణ మహోత్సవంలోని తలంబ్రాలు తమ ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లో అంతా మంచి జరుగుతదని, తమ వ్యాపార విషయాల్లో పనులు అంతా సాఫిగా జరుగుతాయని, అదేవిధంగా పెళ్లికాని వారికి కూడా త్వరగా పెళ్లి అవుతదనేది భక్తుల నమ్మకం. అందుకే ఆ తలంబ్రాల కోసం భక్తులు పెద్ద ఎత్తున ఎగబడుతుంటారు.