దిశ, సంగారెడ్డి : జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 1861 పోలీస్ యాక్ట్ అమలు చేయనున్నట్లు జిల్లా ఎస్‌పీ ఎం రమణ కుమార్ తెలిపారు. అంటే మార్చి 1 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీస్ యాక్ట్ 1861 అమల్లో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా జిల్లా ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని ఆయన తెలిపారు. ప్రజా ధనానికి నష్టం కల్గించే, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని, జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చట్టరిత్య కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.