అత్తమామలను ఇంటికి పిలిచిన అల్లుడు.. వచ్చాక గొడ్డలితో..

దిశ, మల్యాల: మాట్లాడుకుందాం అంటూ అత్తమామలను ఇంటికి పిలిచిన అల్లుడు వారిపై.. Latest Telugu News..

Update: 2022-03-19 16:28 GMT

దిశ, మల్యాల: మాట్లాడుకుందాం అంటూ అత్తమామలను ఇంటికి పిలిచిన అల్లుడు వారిపై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మల్యాల మండలంలో చోటుచేసుకుంది. ఈ బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. రామడుగు మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన పాలమాకుల మల్లేశం తన కూతురిని మల్యాల మండలం మద్దుట్ల గ్రామానికి చెందిన బండపెల్లి సాగర్‌కి ఇచ్చి రెండు సంవత్సరాల క్రితం పెళ్ళి చేశఆడు. కాగా పెళ్ళైన నాటి నుండి తన కూతురుని సరిగా చూసుకోవడం లేదని, తరచూ ఏదో ఒక కారణంతో గొడవ పడుతుండేవాడని తెలిపారు.

అయితే ఇదే విషయమై మాట్లాడుకుందాం రమ్మని పిలిచాడని, దాంతో అతడి ఇంటికి వెళ్లామని చెప్పాడు. తాము ఇంటికి వెళ్లిన అనంతరం అతడు ఉద్దేశ్య పూర్వకంగా తమపై దాడి చేసాడని తెలిపాడు. తనపై హత్యాయత్నం చేయగా తప్పించుకునే ప్రయత్నంలో తన భార్యకు గాయాలయ్యాయని తెలిపాడు. తన అల్లుడు సాగర్ తల్లి ప్రోద్బలంతోనే దాడి చేసి తమను హత్య చేసేందుకు యత్నించాడని మల్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మల్యాల ఎస్సై మంద చిరంజీవి తెలిపారు.

Tags:    

Similar News