టీ20 వరల్డ్ కప్‌‌కు ముందు భారత్‌కు షాక్.. స్టార్ ఓపనర్ తలకు గాయం!

Update: 2022-02-28 14:17 GMT

న్యూఢిల్లీ: టీమిండియా ఒపెనింగ్ బ్యాటర్ స్మృతి మంధాన తలకు గాయమైంది. సోమవారం రంగియోరాలో సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వార్మప్ మ్యాచులో షబ్నిమ్ ఇస్మాయిల్ వేసిన బౌన్సర్ వేగంగా వచ్చి బ్యాటర్ ఎడమ చెవి దిగువన గట్టిగా తగిలింది. దీంతో వెంటనే అక్కడకు చేరుకుని స్మృతి పరిస్థితిని పరిశీలించిన మ్యాచ్ డే డాక్టర్ విశ్రాంతి తీసుకోవాలని తెలపడంతో ఆమె రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు. ఆ తర్వాత వైద్యుల ట్రీట్మెంట్, సూచనల మేరకు మంధాన గాయం నుంచి కోలుకున్నట్టు తెలిసింది. అయితే, తదుపరి మ్యాచ్‌లు, మార్చి 6 నుంచి ప్రారంభం కానున్న ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో లెఫ్ట్ హ్యాండ్ డాషింగ్ బ్యాటర్ స్మృతి మంధాన అందుబాటులోనే ఉంటుందని బీసీసీఐ గౌరవ కార్యదర్శి జే షా మీడియా ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, టీ20 వరల్డ్ కప్‌నకు ముందు సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లతో భారత్ వార్మప్ మ్యాచులు ఆడేలా బీసీసీఐ ప్లాన్ చేసింది. కాగా, మంధాన ఇప్పటివరకు 64 వన్డే మ్యాచులు ఆడి నాలుగు సెంచరీలతో సహా 2,461 పరుగులు చేసింది.

Tags:    

Similar News