శ్రీనగర్ మసీదులో హోరెత్తిన దేశ వ్యతిరేక నినాదాలు.. వారే చేశారన్న అధికారులు
శ్రీనగర్ : దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినందుకు గాను 13 మందిని అరెస్టు చేసినట్టు శ్రీనగర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పీ) రాకేష్ బల్వాల్
శ్రీనగర్ : దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినందుకు గాను 13 మందిని అరెస్టు చేసినట్టు శ్రీనగర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌ఎస్‌పీ) రాకేష్ బల్వాల్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీనగర్‌లోని అతిపెద్దదైన జామీయా మసీదులో శుక్రవారం సామూహిక ప్రార్థనల అనంతరం కొందరు పోకిరీలు కావాలనే దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని తొలగించినప్పటి నుంచి ఈ మసీదును కేంద్ర ప్రభుత్వం మూసివేసింది. ఆ తర్వాత కొవిడ్ నేపథ్యంలో కూడా అదే కొనసాగుతూ వచ్చింది. అయితే, 2021లో కొన్ని ఆంక్షలతో ప్రార్థనలకు అనుమతులు ఇవ్వగా అప్పటి నుంచి ప్రార్థనల అనంతరం కొందరు పోకిరీలు కావాలనే దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తప్పించుకునేవారని పేర్కొన్నారు.
శుక్రవారం ఈ మసీదులో ఏకంగా 24000 మంది ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతి ఉండగా, కొందరు కావాలనే పెద్దగా యాంటీ నేషనల్ నినాదాలు చేసి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత మసీదులో రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీయగా నినాదాలు చేసిన వారిని చెదరగొట్టేందుకు మసీదు కమిటీ నిర్వాహకులు ప్రయత్నించినట్టు సమాచారం. అయితే పాకిస్తాన్ నుంచి వచ్చిన పోకిరీలు మసీదులో దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని, ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందని పోలీసులు తెలిపారు.