దిశ, వెబ్‌డెస్క్: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. యుద్ధంలో భాగంగా ఉక్రెయిన్‌లోని అతి పెద్ద అణువిద్యుత్ కేంద్రంపై రష్యా దాడి చేసింది. దీనిపై ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్స్‌కి స్పందించారు. ఒక్క పేలుడు పూర్తి యూరప్‌ను అంతం చేస్తుందని అన్నారు. 'అణు విద్యుత్ కేంద్రంలో ఒక్క పేలుడు జరిగిందంటే.. యూరప్ ఖండం అంతం అవుతుంది. ఈ పేలుడు జరిగిలా చేసి యూరప్ అంతానికి తావు ఇవ్వద్దు' అని జెలెన్స్‌కి అన్నారు. అయితే ఇటీవల అణు విద్యుత్ కేంద్రంలో మంటలు చెలరేగాయని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ట్వీట్ చేశాడు.