30 ఏళ్ల జైలు శిక్ష.. సింగర్‌కు షాకిచ్చిన కోర్టు
దిశ, సినిమా : అమెరికన్ సింగర్ ఆర్. కెల్లీకి న్యూయార్క్ కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. కొన్నేళ్లపాటు మహిళలు, టీనేజర్లను సెక్స్‌వల్‌గా వాడుకుంటూ హింసించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గాయకుడికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది..Latest Telugu News
దిశ, సినిమా : అమెరికన్ సింగర్ ఆర్. కెల్లీకి న్యూయార్క్ కోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. కొన్నేళ్లపాటు మహిళలు, టీనేజర్లను సెక్స్‌వల్‌గా వాడుకుంటూ హింసించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గాయకుడికి 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే న్యూయార్క్ జ్యూరీ గతేడాదే అతన్ని దోషిగా నిర్ధారించగా.. తాజాగా ఫెడరల్ కోర్టు జడ్జి ఆన్.డోన్నెల్లీ బ్రూక్లిన్ ఈ తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా ఈస్టర్స్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్‌లోని యూఎస్ అటార్నరీ కార్యాలయం ఓ ట్వీట్‌ను పోస్ట్ చేయడం విశేషం.
ఇక 'మీటూ' మూమెంట్ టైమ్‌లో అతనిపై లైంగిక ఆరోపణలు చేసిన పలువురు మహిళలు కేసు కూడా నమోదు చేశారు. అంతేకాదు 'స్టార్డమ్ ముసుగులో కెరీర్లో సాయం చేస్తానని ఎంతోమందిని నమ్మించి లైంగికంగా లోబరుచుకున్నాడు. సెక్స్ అవసరం తీరిపోయాక ముఖం చాటేశాడు. అతని మూలంగా అనేక మంది జీవితాలు నాశనమయ్యాయి. శారీరకంగానే కాక మానసికంగానూ ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాం' అంటూ టీనేజీ అమ్మాయిలు కోర్టులో సాక్ష్యం చెప్పడం అప్పట్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.