ఫ్లైట్ ఆలస్యంపై శృతి హాసన్ ఫైర్
తాను ప్రయాణించాల్సిన విమానం ఆలస్యంపై ప్రముఖ నటి శృతిహాసన్ మండిపడ్డారు.
దిశ, వెబ్ డెస్క్ : తాను ప్రయాణించాల్సిన విమానం ఆలస్యంపై ప్రముఖ నటి శృతిహాసన్ (Tollywood heroine Shruti Haasan) మండిపడ్డారు. శృతిహాసన్ తాను ప్రయాణించాల్సిన ఇండిగో విమాన సర్వీస్ నాలుగు గంటల ఆలస్యం అయిందని, కనీసం ప్రయాణికులకు కనీసం సమాచారం ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై తన ఎక్స్ ఖాతా వేదికగా ఇండిగో సంస్థకు ఫిర్యాదు చేశారు. శృతి చేసిన ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ కాగా.. ఇండిగో ఎయిర్ లైన్స్ స్పందించి వివరణ ఇచ్చింది. వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్లే విమాన సర్వీస్ ఆలస్యం అయిందని తెలిపింది. ప్రయాణికుల పరిస్థితిని అర్థం చేసుకోగలం అంటూ.. అసౌకర్యానికి క్షమించమని కోరింది.