దిశ, జవహర్ నగర్ : బీహార్ కు చెందిన భరత్, మమత దంపతులు. గత కొంత కాలం క్రితం బతుకు దెరువు కోసం ఇరవై ఏళ్ల కుమారుడితో కలిసి వీరు జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్ లో నివాసం ఉంటూ కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో పాటు మతిస్థిమితం లేని మమత అదృశ్యమైంది. ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయినట్లు ఆమె కుమారుడు కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.