పాప కావాలంటే బాబుని పుట్టిచ్చారు.., కోర్టుకెళ్లిన లెస్బియన్ జంట!
ఇందులో ఎంతో మానసిక కష్టం దాగుంటుంది. She Had IVF For A Baby Girl But Gave Birth To A Boy.
దిశ, వెబ్‌డెస్క్ః గర్భం దాల్చడం ఓ అపూర్వ ఘట్టం. ఈ రోజుల్లో చాలా మంది స్త్రీలకు అలాంటి పరిస్థితి లేక ఆధునిక వైద్యం సదుపాయంతో పిల్లల్ని కంటున్నారు. ఇందులో ఎంతో మానసిక కష్టం దాగుంటుంది. న్యూయార్క్‌కు చెందిన లెస్పియన్ జంట కూడా ఇలాగే పిల్లల కోసం ఐవిఎఫ్ చేయించుకున్నారు. ఆడపిల్ల కావాలని కలలుగని, ఆమె కోసమే ఎంతో డబ్బు ఖర్చు చేసిన వీరు చివరికి ఒక మగబిడ్డను ఎత్తుకోవాల్సి వచ్చింది. పుట్టిన బిడ్డనైతే బాగానే చూసుకుంటున్నారు గానీ తప్పు చేసిన న్యూయార్క్‌లోని ఫెర్టిలిటీ క్లినిక్‌పై కోర్టులో దావా వేశారు హీథర్ విల్‌హెల్మ్-రోటెన్‌బర్గ్, ఆమె భార్య రాబిన్ (రాబీ).
దీని గురించి ఈ జంట న్యూయార్క్ పోస్ట్‌తో మాట్లాడారు. హీథర్ గర్భంలో అమర్చిన పిండం కోసం వారు రాబీ ఎగ్‌ని, దాత స్పెర్మ్‌ను ఎంచుకున్నారు. దీని ద్వారా తమకు ఒక అమ్మాయి పుట్టాలని భావించిన తర్వాత, 15వ వారం స్కాన్‌లో వారికి పెద్ద షాక్ తగిలింది. సోనోగ్రాఫర్ వారికి గర్భంలో మగబిడ్డ ఉన్నాడని చెప్పారు. దీనిపై హీథర్ తీవ్రంగా స్పందించింది. తాము కావాలనుకున్న తమ బిడ్డను కాకుండా ఇలా వేరే బిడ్డను ఇవ్వడంపై ఫెర్టిలిటీ సెంటర్‌ను కోర్టుమెట్లు ఎక్కించారు. ఇలా చేయడం రేప్‌తో సమానమని వాదించారు. అందులోనూ హీథర్‌కి ఆసుపత్రి అంటేనే భయం, ఇక సంతానం పొందే ప్రక్రియలో ఆమె చాలా శారీరక నొప్పిని అనుభవించింది, ఇలాంటి స్థితిలో తాము అనుకున్న బిడ్డ కాకుండా మగ బిడ్డను కనడంపై చాలా విచారం వ్యక్తం చేశారు. 'మేము ఇప్పుడు వేరే బిడ్డను పెంచుతున్నట్లు అనిపిస్తుందని' కోర్టుకు విన్నవించుకున్నారు.