కీసర గుట్ట బ్రహ్మోత్సవాలలో.. పారిశుధ్య కార్మికులకు ఘెర అవమానం!

Update: 2022-03-04 14:57 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్: ఇంతలా అవమానిస్తారా..? కీసర గుట్ట బ్రహ్మోత్సవాలలో వారం రోజులుగా అహోరాత్రులు పారిశుధ్య పనులు చేపడితే ఉడకని ఆహార పదర్ధాలు పెడ్తారా..? కీసరగుట్ట పై పారిశుద్ధ్య కార్మికులకు ఘోర అవమానం జరిగిందనే చెప్పాలి. పొట్ట చేతపట్టుకొని కీసర గుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం వచ్చి పనిచేస్తుంటే కార్మికుల మైన మాకు ఉడికీ ఉడకని ఉప్మా, కారం నీళ్ళు ఆహారంగా అందించడం అధికారులు నిర్లక్ష్య పనితీరుకు నిదర్శనమని వారు ఆగ్రహించారు. తమకు ఇచ్చే గౌరవం ఇదేనా..? అంటూ పారిశుధ్య కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. శుక్రవారం కీసరగుట్ట ఆలయం వద్ద జరిగిన ఈ అవమాన ఘటనకు సంబంధించి కార్మికులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి.. గత వారం రోజులుగా నిరంతరం కష్టపడి పనిచేస్తూ కీసరగుట్ట పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుధ్య కార్మికులకు ఘోర అవమానం జరిగిందన్నారు. నిత్యం పరిసరాలన్నీ శుభ్రంగా ఉంచుతున్న తమకు ఉడికీ ఉడకని, ఉండలు ఉండల ఉప్మా, కారం నీళ్ళు ఆహారంగా అందింస్తారా అని ఆ ఆవేదన వ్యక్తం చేశారు. వంట ఏర్పాటు, వాటికి బాధ్యత వహించే అధికారుల పనితీరుకు ఆగ్రహించి సుమారు 1200 ల మంది పారిశుధ్య కార్మికులు వంటశాల వద్ద ధర్నాకు దిగారు. వెంటనే తమ తప్పు తెలుసుకుని కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

తప్పు మీద తప్పు..



మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శ్రీభవానీ రామలింగేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అధికారులు ప్రతీ రోజూ తప్పులమీద తప్పులు చేస్తూ విమర్శల పాలవుతున్నారు.వారం రోజులుగా నిరంతరం పారిశుధ్య నిర్వహణ బాధ్యతలు చూస్తున్న కార్మికులకు ఉడికీ ఉడకని ఉప్మా, కారం నీళ్లు ఆహారంగా అందించి అధికారులు అవమానించారు. ఇదేమిటని అడిగితే పారిశుధ్య కార్మికులపై అధికారులు అవమానీయంగా ప్రవర్తించారు. దీంతో కార్మికులు ఆందోళనకు దిగి అధికారులకు వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. విధులను బహిష్కరించి నిరసన తెలియజేస్తామని హెచ్చరించడంతో తమ తప్పు తెలుసుకున్న జిల్లా పంచాయితీ అధికారి రమణమూర్తి కార్మికులకు క్షమాపణ చెప్పాడు. కీసరగుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మొదలు ఓ వైపు పోలీసుల ఓవర్ యాక్షన్, మరో వైపు భక్తులు అవస్థలు పడుతున్న స్పందించిన యంత్రాంగం..ఇంకోవైపు కార్మికుల పట్ల అధికారుల నిర్లక్ష్యం వస్తుండటంతో వెంటనే ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు, భక్తులు, కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News