షకీరాకు 8 ఏళ్ల జైలు శిక్ష?.. షాక్‌లో ఫ్యాన్స్

దిశ, సినిమా : హాలీవుడ్ పాప్‌స్టార్ షకీరాకు ఎనిమిదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది.

Update: 2022-07-30 08:06 GMT

దిశ, సినిమా : హాలీవుడ్ పాప్‌స్టార్ షకీరాకు ఎనిమిదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. ప‌న్ను ఎగ‌వేత కేసులో ఆమెకు కఠినమైన శిక్ష వేయాల‌ంటూ బార్సిలోనా ప్రాసిక్యూట‌ర్లు బలంగా వాదిస్తున్నారు. విషయానికొస్తే.. షకీరా కొంతకాలంగా ట్యాక్స్ కుంభ‌కోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ మేరకు స్పెయిన్ ప్రభుత్వాన్ని మోసం చేసినట్లు అంగీకార ఒప్పందాన్ని ఆమె నిరాకరించడంతో 8 ఏళ్ల జైలు శిక్ష వేయాల‌ని స్పెయిన్ కోర్టు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఈ కేసు పూర్తి విచార‌ణకు సంబంధించి త్వర‌లోనే తేదీని ప్రక‌టించ‌నుండగా తాజాగా మీడియాతో మాట్లాడిన సింగర్.. 2012 నుంచి 2014 మధ్య కాలంలో తాను స్పెయిన్‌లో నివసించలేదని చెప్పింది. అంతకుముందే తాను 17.2 మిలియన్ యూరోలు స్పానిష్ పన్ను కార్యాలయానికి చెల్లించానని, తనకు సంబంధించి ఎలాంటి బకాయిలు లేవని స్పష్టం చేసింది.

Tags:    

Similar News