స్టాక్ మార్కెట్లకు తప్పని నష్టాలు!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి నష్టాలను ఎదుర్కొన్నాయి. గత రెండు latest telugu news..
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి నష్టాలను ఎదుర్కొన్నాయి. గత రెండు సెషన్లలో మెరుగైన లాభాలతో ర్యాలీ చేసిన సూచీలు సోమవారం ట్రేడింగ్‌లో రోజంతా ఊగిసలాట మధ్య కదలాడాయి. మిడ్-సెషన్ వరకు స్థిరంగా ఉన్న తర్వాత చివర్లో నష్టాలు పెరిగాయి. ఉదయం సానుకూలంగా కనిపించిన స్టాక్ మార్కెట్లు కొద్దిసేపటికే నష్టాల్లోకి జారాయి. చివరి గంట వరకు అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో అధిక నష్టాలు నమోదయ్యాయి.
ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రం కావడం, ఉక్రెయిన్ సమర్థవంతంగా పోరాడుతుండటంతో రష్యా మరింత తీవ్రంగా దాడులను కొనసాగిస్తోంది. మరోవైపు యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయ మార్కెట్లు క్షీణించాయి. అలాగే, ముడి చమురు సరఫరాలో ఇబ్బందులు ఉంటాయనే సంకేతాలతో ఇన్వెస్టర్లలో ఆందోళన పెరిగింది. ఎక్కువ రోజుల పాటు యుద్ధం కొనసాగితే మరిన్ని సమస్యలు ఉంటాయనే భయాలు మదుపర్లలో నెలకొంది. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 571.44 పాయింట్లు కుదేలై 57,292 వద్ద, నిఫ్టీ 169.45 పాయింట్లు కోల్పోయి 17,117 వద్ద ముగిశాయి.
నిఫ్టీలో మెటల్, మీడియా, ఫార్మా రంగాలు నిలదొక్కుకున్నాయి. ఎఫ్ఎంసీజీ, ఆటో, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతీ సుజుకి, టైటాన్, ఎన్‌టీపీసీ షేర్లు మాత్రమే లాభాలను దక్కించుకున్నాయి. మిగిలిన షేర్లన్నీ క్షీణించాయి. ముఖ్యంగా పవర్‌గ్రిడ్, ఏషియన్ పెయింట్, ఆల్ట్రా సిమెంట్, నెస్లె ఇండియా, కోటక్ బ్యాంక్, హిందూస్తాన్ యూనిలీవర్, హెచ్‌సీఎల్ టెక్, ఎస్‌బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు అధిక నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 76.20 వద్ద ఉంది.