WhatsApp: వాట్సాప్‌లో పెళ్లి పత్రిక పంపిస్తున్నారా..? తస్మత్ జాగ్రత్త..?
ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌స్మోర్ట్ వాడుతోన్న ప్రతి ఒక్కరికీ వాట్సాప్ ఉంటుంది.
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్(Smartphone) వాడుతోన్న ప్రతి ఒక్కరికీ వాట్సాప్(WhatsApp) ఉంటుంది. కాగా ఈ రోజుల్లో ఫ్రెండ్స్(Friends), దూరంగా ఉన్న బంధువుల్ని(Relatives) వివాహాలకు ఆహ్వానించడానికి ఎక్కువగా వాట్సాప్‌లోనే పెళ్లి పత్రికల్ని(Wedding invitation) పంపిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే పలు స్కామ్‌లు(Scams) జరుగుతున్నాయి. వాట్సాప్‌లో మీకు ఏదైనా వెడ్డింగ్ ఇన్విటేషన్(Wedding invitation) వస్తే జాగ్రత్త. ఇటీవల సైబర్ మోసగాళ్లు(Cyber fraudsters) రోజుకో కొత్త ప్లాన్‌తో ప్రజల దగ్గర మనీ స్కామ్ చేస్తున్నారు. తాజాగా మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. మీ వాట్సాప్‌కు పెళ్లి ఆహ్వానం వచ్చిందని వెంటనే డౌన్‌లోడ్ చేస్తే మాత్రం మోసగాళ్ల చేతిలో మోసపోయినవారు అవుతారు. తర్వాత దోపిడీకి గురవుతారు.
కాగా వాట్సాప్ ద్వారా నకిలీ డిజిటర్(Duplicate Digitizer) వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు పంపితే జాగ్రత్తగా ఉండండి. అవి ఏపీకే ఫైళ్ల(apk files) రూపంలో.. అలాగే పెళ్లి పత్రిక రూపంలో వాట్సాప్‌కు వస్తుంటాయి. చూడానికి నిజమైన వివాహ కార్డుల్లాగా కనిపిస్తాయి. ఈ హానికరమైన ఏపీకే ఫైల్స్ మోసగాళ్లకు ఓటీపీలు, సందేశాలు, బ్యాంకింగ్ యాప్స్ సహా మీ ఫోన్లలోని సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేస్తుంది.
ఈ కొత్త సైబర్ నేరగాళ్ల లక్ష్యమే ఏపీకే ఫైల్‌ను డైన్‌లోడ్ చేయించడం. ఇన్‌స్టాల్ చేయడం మిమ్మల్ని మోసం చేయడం. కాగా మీ వాట్సాప్ కు పెళ్లి పత్రిక వస్తే వెడ్డింగ్ జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.