రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో.. ఆ మాజీ మంత్రి గెలుపు కోసం రహస్య భేటీలు!

దిశ, తిరుమలాయపాలెం: రాబోయే - Secret meetings to help former minister Tummala Nageswara Rao win the upcoming assembly elections

Update: 2022-03-07 11:34 GMT

దిశ, తిరుమలాయపాలెం: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మండలం నుంచి మద్దతు తెలిపి, విజయం కట్టబెట్టేందుకు వివిధ పార్టీల నాయకులు గుట్టలలో రహస్య భేటీ అయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో తీవ్ర చర్చనీయంశమైంది. మండల పరిధిలోని జల్లెపల్లి, హైదర్ సాయిపేట గ్రామాల మధ్య ఉన్న గుట్టలలో ఆదివారం మండలంలోని తుమ్మల వర్గీయులు రహస్య భేటీ అయ్యారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ నాయకుడిని గెలిపించుకునేందుకు.. స్థానిక మండల నాయకుల కార్యాచరణ రూపొందించేందుకు, వివిధ గ్రామాల నాయకులు సమావేశం అయినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు మరో వారంలో మరి కొంతమందితో, కలసివచ్చే నాయకులతోనూ విస్తృత సమావేశం నిర్వహించేందుకు ప్లాన్ దిశగా తుమ్మల వర్గీయులు అడుగులు వేస్తున్నారని టాక్ వస్తోంది. రేపోమాపో మండల తాజా, మాజీ ప్రజాప్రతినిధులు కొంతమంది, పలు పార్టీల నాయకులు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసేందుకు సిద్ధంగా ఉన్నారని విశ్వసనీయ సమాచారం.

ఇది ఇలా ఉండగా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలం లో నిర్మించిన భక్త రామదాసు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది కేసీఆర్ అనే, ఆ ఘనత ఆయనకే దక్కిందని ఓ సందర్భంలో తుమ్మల మాట్లాడిన వీడియో, కందాల వర్గీయులు వాట్సప్ గ్రూప్ లో పోస్ట్ చేయడంతో అధికాస్త వైరల్ గా మారింది. రోజు రోజుకూ రాజకీయాలు వేడి పుట్టిస్తున్న నేపథ్యంలో అటు మండల రాజకీయల పరిణామాలలో జనం నాడీ ఎటు వైపని, ప్రజాదరణ లభించేది కందాలకా లేక తుమ్మలక అనే అనుమానాలు మండల ప్రజలలో రేకెత్తుతున్నాయి. ఏది ఏమైనా సమయం వచ్చేవరకు వేచి చూద్దాం.

Tags:    

Similar News