Sara Ali Khan: ఇద్దరి మధ్య అదొక్కటే తేడా.. మిగతాదంతా సేమ్ : బాలీవుడ్ నటి

దిశ, సినిమా: బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ తన సోదరుడు ఇబ్రహీం గురించి..telugu latest news

Update: 2022-04-07 13:33 GMT

దిశ, సినిమా: బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ తన సోదరుడు ఇబ్రహీం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇటీవల కాలంలో తామిద్దరి పోలికల గురించి నెట్టింట చర్చ జరుగుతుండగా.. ఓ మీడియా సమావేశంలో నెటిజన్ల సందేహాలను క్లియర్ చేసింది. 'తండ్రి సైఫ్ అలీఖాన్, తల్లి అమృతాసింగ్‌ ప్రేమకు చిహ్నంగా ఇద్దరం పురుడు పోసుకున్నాం. ఇబ్రహీం నాకంటే ఆరేళ్లు చిన్నవాడు. నేను అచ్చం అమ్మలా ఉంటానని, ఇబ్రహీం నాన్నలా ఉంటాడని అందరూ చెబుతుంటారు. కానీ మేమిద్దరం ఒకేలా కనిపిస్తాం. ఇద్దరిలోనూ అమ్మానాన్నల పోలికలు పుష్కలంగా ఉన్నాయి. మాకున్న అసలైన తేడాలు చెప్పాలంటే.. ఇబ్రహీం కూల్ అండ్ కామ్‌. చూసేందుకు నాన్నలా ఉన్నప్పటికీ ప్రవర్తన మాత్రం అమ్మలా ఉంటుంది. నేను కూడా అంతే.. అమ్మలా ఉన్నప్పటికీ యాటిట్యూడ్, యాక్టివ్‌నెస్‌లో నాన్న మాదిరే ఉంటా. అందుకే మా కుటుంబంలో ఈ విషయం చర్చకు వచ్చినప్పుడు మా వ్యక్తిత్వాలు, ముఖ పోలికల గురించే డిస్కస్ చేస్తుంటాం' అంటూ వివరించింది.

Tags:    

Similar News