నా భర్తకు ఆమెతో ఎఫైర్ ఉంది.. నటి షాకింగ్ కామెంట్స్

దిశ, సినిమా: కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘లాక్‌అప్’ షోకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.Telugu latest news

Update: 2022-03-20 09:33 GMT

దిశ, సినిమా: కంగనా రనౌత్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'లాక్‌అప్' షోకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. షోలో భాగంగా కంటెస్టెంట్స్ రివీల్ చేస్తున్న కొన్ని విషయాలు నెటిజన్లనే కంగు తినిపిస్తున్నాయి. ఇటీవలే పూనమ్ పాండే, శివమ్ శర్మ తదితరులు తమ జీవితంలోని అతి పెద్ద రహస్యాలను బయటపెట్టగా.. తాజాగా నటి, మోడల్ సారా ఖాన్ మాజీ భర్తతో విడిపోవడానికిగల కారణాన్ని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

విషయానికొస్తే.. కొంతకాలం పాటు డేటింగ్‌ చేసిన సారా ఖాన్, అలీ మర్చంట్‌ 2010లో బిగ్ బాస్ స్టేజిపైనే పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచారు. అయితే పెళ్లయిన రెండు నెలల్లోనే విబేధాలతో ఈ జంట విడిపోగా.. అలీ మర్చంట్‌ చేసిన పాడు పని గురించి ఈ షోలో వెల్లడించింది సారా. 'అలీకి లోఖండ్‌వాలాలో ఒక స్పా ఉంది. అక్కడ పనిచేసే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు. విషయం తెలిసి నిలదీశాను. పద్ధతి మార్చుకోమని 300 సార్లు చెప్పినా పట్టించుకోలేదు. తనపై ఉన్న ఇష్టంతో ఎన్నో అవకాశాలు ఇచ్చాను. చివరకు అతనితో జీవితాన్ని కొనసాగించలేనని క్లారిటీ రావడంతో విడాకులు తీసుకున్నా. ప్రస్తుతం అలీ ఎంజాయ్ చేస్తుంటే.. నాలుగేళ్లుగా నేను కుమిలిపోతున్నా' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.


Tags:    

Similar News