స్వరాష్ట్రంలో ఫార్మాసిస్టులకు అన్యాయం: ఫార్మసీ సోసైటీ ప్రెసిడెంట్
దిశ, తెలంగాణ బ్యూరో: స్వరాష్ట్రం - Sanjay Reddy, President, Pharmacy Society, leaves as the Chief Guest at the Statewide Pharmacists' Conference held at Nizam College
దిశ, తెలంగాణ బ్యూరో: స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఫార్మాసిస్టులకు రెగ్యులర్రిక్రూట్మెంట్లు, ప్రమోషన్లు లేవని తెలంగాణ ఫార్మసీ సోసైటీ ప్రెసిడెంట్ డా ఆకుల సంజయ్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో జరిగిన రాష్ట్ర వ్యాప్త ఫార్మాసిస్టుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డా సంజయ్మాట్లాడుతూ.. ఫార్మసీ కౌన్సిల్‌ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎంతో మంది ఫార్మసిస్టులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. జిల్లాకు రెండు చొప్పున 33 జిల్లాలకు 66 ఫార్మసీ ఇన్స్పెక్టర్లు, ఖాళీగా ఉన్న 13 డ్రగ్ఇన్స్పెక్టర్ ల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌చేశారు.
ఫార్మసిస్టులకు కనీస వేతనం రూ. 30 వేలు ఇచ్చేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సినఅవసరం ఉన్నదన్నారు. దీంతో పాటు మెడికల్‌షాపులు స్థాపించేందుకు క్వాలిఫైడ్ ఫార్మసిస్టులకు ప్రభుత్వం రూ. 5 లక్షల లోన్‌ల రూపంలో సాయం చేయాలన్నారు. ఫార్మ స్యూటికల్కంపెనీని స్థాపించడానికి ఫార్మసిస్టులకు రూ. కోటి వరకు లోన్‌లు ఇవ్వాలన్నారు. అంతేగాక ఫార్మసిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డైరెక్టరేట్ ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫార్మసీ అసోసియేషన్నాయకులు చంద్రశేఖర్ఆజాద్, వీరారెడ్డి, తిరుమల్‌రావు, చారి, నరేష్, సాకేత్తదితరులు పాల్గొన్నారు.