దేవుడు ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోమని సంకేతమిచ్చాడు.. నటి

దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ యాక్ట్రెస్ సనా ఖాన్ ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేసింది. సినిమాల ద్వారా పేరు, డబ్బు, కీర్తి ప్రతిష్టలు పొందినప్పటికీ ప్రశాంతత కరువైందని తెలిపింది.

Update: 2022-07-27 07:35 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ యంగ్ యాక్ట్రెస్ సనా ఖాన్ ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పేసింది. సినిమాల ద్వారా పేరు, డబ్బు, కీర్తి ప్రతిష్టలు పొందినప్పటికీ ప్రశాంతత కరువైందని తెలిపింది. 2020లో ముఫ్తీ అనాస్‌ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయిన బ్యూటీ తను చేయాలనుకున్నా పనిని చేసేంత వరకు నిద్రపోనని, అయితే దానికి ఫ్రీడమ్ ఉండాలని తెలిపింది. అలాగే ఇండస్ట్రీలో రాణించగలననే నమ్మకమున్నా అక్కడ సంతోషంగా ఉండలేకపోయానని, అలా ఎందుకుంటుందనే విషయం కూడా తనకు అర్థం కాలేదని చెప్పింది. 'ఆ పరిస్థితి చాలా కఠినమైనది. ఎన్నో రోజులు నిరాశలో ఉన్నాను. 2019లో రంజాన్ సమయంలో నా కలలో మండుతున్న సమాధిని చూశాను. అందులో నేనే కనిపించాను. నేను మారకపోతే అంతమేనని దేవుడిచ్చిన సంకేతమని అర్థమైంది. దీనిపై ఆందోళన చెందిన నేను.. దీర్ఘంగా ఆలోచించగా డబ్బు, కీర్తి సంపాదించడం కాదు నిస్సహాయులకు సహాయం చేయడమే జీవిత పరమార్థమని తెలుసుకున్నా' అంటూ వివరించింది.

Tags:    

Similar News