Konda Surekha: స్పీకర్‌‌పై దాడికి యత్నం వెనుక భారీ కుట్ర

తెలంగాణ(Telangana) ఉద్యమ సమయంలో దళితవర్గానికి చెందిన నాయకుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్(KCR) మోసం చేశారని మంత్రి కొండా సురేఖ(Konda Surekha) అన్నారు.

Update: 2024-12-20 12:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana) ఉద్యమ సమయంలో దళితవర్గానికి చెందిన నాయకుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్(KCR) మోసం చేశారని మంత్రి కొండా సురేఖ(Konda Surekha) అన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం(Congress Govt) రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక దళిత బిడ్డను రాష్ట్ర శాసనసభ స్పీకరుగా నియమిస్తే.. ఓర్వలేక ఇవాళ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్(Gaddam Prasad Kumar) మీద బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు దాడికి యత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

అక్కడ ఢిల్లీలో పార్లమెంట్(Parliament) సాక్షిగా రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌(BR Ambedkar)ను కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా(Amit Shah) అవమానించ‌డం.. ఇక్కడ అసెంబ్లీలో దళిత బిడ్డ ప్రసాద్ అన్నను బీఆర్ఎస్‌ నేతలు అవమానించ‌డం వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపించారు. ఎందుకంటే, ఆ రెండు పార్టీల డీఎన్ఏ(DNA)లోనే దళిత, గిరిజన, బహుజన వ్యతిరేకత ఇమిడి ఉన్నదని అన్నారు. అందుకే నిమ్న వర్గాలంటే వారికి నిత్యం చిన్నచూపని మండిపడ్డారు. తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం.. దళిత, గిరిజన, బహుజన వర్గాలకు ఏ లోటూ ఉందని భరోసా ఇచ్చారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ(Rahul Gandhi), తెలంగాణలో రేవంత్ రెడ్డి(Revanth Reddy) నాయకత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆయా వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా అడుగులు వేస్తున్నదని అన్నారు.

Tags:    

Similar News