వారితోనే లైంగిక సంక్రమణ వ్యాధుల వ్యాప్తి.. జాగ్రత్త!

దిశ, సినిమా : ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్‌జెండర్ ఫ్యాషన్ డిజైనర్ స్వప్నిల్ షిండే అలియాస్ సాయేషా షిండే.. బ్లడ్ డొనేషన్ విషయంలో కూడా ఎల్‌జిబీటీ కమ్యూనిటీ వివక్ష ఎదుర్కొంటోందని తెలిపింది..Latest Telugu News

Update: 2022-06-29 09:51 GMT

దిశ, సినిమా : ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్‌జెండర్ ఫ్యాషన్ డిజైనర్ స్వప్నిల్ షిండే అలియాస్ సాయేషా షిండే.. బ్లడ్ డొనేషన్ విషయంలో కూడా ఎల్‌జిబీటీ కమ్యూనిటీ వివక్ష ఎదుర్కొంటోందని తెలిపింది. రెండేళ్ల క్రితం వరకు రక్త దానం చేసిన తనను.. జెండర్ చేంజ్ చేసుకున్నాక నిరాకరించారని తెలిపింది.

చట్ట ప్రకారమే ఇది జరుగుతుందని తెలుసుకుని బాధపడ్డానన్న ఆమె.. 'అంటే మేము లైంగిక సంక్రమణ వ్యాధులను మోసుకెళ్లే వర్గంలో ఉన్నాము. జెండర్ మార్చుకుంటే రక్తం మారుతుందా? స్వలింగ సంపర్కులు వ్యాధులు వ్యాపింపజేస్తున్నారు అనేది వివక్షకు మించినది' అని పేర్కొంది. కాగా సాయేషా షిండే 'లాక్ అప్' షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.


Similar News