రాష్ట్రపతిని కలిసిన సాగర్ బీజేపీ ఇన్ఛార్జ్ రవి నాయక్

దిశ, హాలియ : న్యూఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను నాగార్జున latest telugu news..

Update: 2022-03-10 13:57 GMT

దిశ, హాలియ : న్యూఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను నాగార్జున సాగర్ బీజేపీ ఇంచార్జ్ డాక్టర్ పానుగోతు రవికుమార్ నాయక్, అఖిల భారత బంజారా శక్తి పీఠ్ ధర్మ గురువు సంత్ శ్రీ బాబు సింగ్ మహారాజ్, శ్రీ గుగులోతు వెంకన్న నాయక్, బీజేపీ రాష్ట్ర నాయకులు సమావేశమై భారతదేశంలో 12 కోట్లమంది బంజారా సమాజం మాట్లాడేటటువంటి భాష "గోరబోలి" ని భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ లో చేర్చాలని గత 30 సంవత్సరాల నుంచి భారత ప్రభుత్వానికి మొరపెట్టుకున్న ఆనాటి పాలకులు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు.

గోరబోలీ భాషను రాజ్యంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చే విషయాన్ని పరిశీలించి రాజ్యాంగంలో చేర్చే విధంగా చొరవ చూపాలని కోరడం జరిగింది. అదే విధంగా భారత దేశంలో గిరిజనులకు 7.5 శాతం రిజర్వేషన్ అమలులో ఉన్న 3 శాతం కూడా ఆచరణలో అమలు కావడం లేదని.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 12 శాతం గిరిజన రిజర్వేషన్ అమలు అయ్యే విదంగా చూడాలని కోరారు.

అలాగే తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులు పొడుభూముల సమస్యతో ఇబ్బంది పడుతున్నారని, దేశంలో అటవీ 2005 చట్టం, PESA చట్టం, 1/70 చట్టం అమలులో ఉన్న తెలంగాణలో మాత్రం అమలు కావడం లేదని.. కనుక తమరు చొరవ చూపాలని..12 కోట్ల బంజారాల కోసం దేశ రాజధానిలో 2 ఎకరాల స్థలం బంజారా భవన్ కొరకు కేటాయించాలని రాష్ట్రపతి గారిని కోరడం జరిగింది. పై విషయాలను పరిశీలించి తప్పకుండా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాహుల్ నాయక్ పాల్గొన్నారు.

Tags:    

Similar News