దిశ, వెబ్‌డెస్క్ :ఉక్రెయిన్ సైన్యం ముందు లొంగిపోయిన ఓ రష్యా సైనికుడి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇరుదేశాల మధ్య యుద్ధం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌లోకి ప్రవేశించిన రష్యా సైనికుల్లో కొందరు యుద్ధం నుంచి విరమించుకుంటున్న వీడియోలు ఇటీవల చాలానే వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కనిపించిన ఈ వీడియోలో రష్యా సైనికుణ్ణి చూసి ఉక్రెయిన్ పౌరులు కూడా కన్నీళ్లు పెడుతున్నారు. లొంగిపోయిన రష్యా సైనికుడు ఒక్కసారి తన తల్లితో మాట్లాడతానని అర్థించగా ఉక్రెయిన్ సైన్యం అతడికి అవకాశం ఇచ్చింది. రష్యన్ సోల్జర్ తన తల్లితో మాట్లాడుతున్నప్పుడు వెక్కి వెక్కి ఏడ్చాడు. అయితే, అతనికి టీ, పేస్ట్రీని ఇచ్చిన ఉక్రెయిన్‌లు రష్యన్ బాధను చూసి, కన్నీళ్లు పెట్టుకున్నారు.