స్పేస్ఎక్స్‌ని టార్గెట్ చేసిన ర‌ష్యా..! ఎలన్ మ‌స్క్‌ హెచ్చ‌రిక‌..!!

Update: 2022-03-04 06:43 GMT

దిశ‌, వెబ్‌డెస్క్: స్పేస్ ఎక్స్ (SpaceX ) సీఈఓ ఎలన్ మ‌స్క్ తాజాగా ట్విట్ట‌ర్‌లో ఓ ప్ర‌క‌ట‌న చేశారు. తాను క‌ల‌లు గ‌ని, సొంత‌గా ప్రారంభించిన స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన‌ స్టార్‌లింక్ శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ స‌ర్వీస్ ల‌క్ష్యంగా ర‌ష్యా దాడులు చేయ‌వ‌చ్చ‌ని ఆయ‌న వెల్ల‌డించారు. ఉక్రెయిన్‌పై చేస్తున్న దాడుల‌ను తీవ్ర‌త‌రం చేసే నేప‌థ్యంలో శాటిలైట్ కమ్యూనికేషన్ పరికరాలు "బీకాన్‌లు"గా ఉపయోగపడతాయి గ‌నుకు ర‌ష్యా వాటిని టార్గెట్ చేసే అవ‌కాశం ఉంద‌ని ఇంటర్నెట్ భద్రతను చూసే ఓ పరిశోధకుడు ఎలన్ మ‌స్క్‌ను హెచ్చ‌రించ‌గా ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఇది జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని న‌మ్మిన ఎలన్ మ‌స్క్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఉక్రెయిన్‌ను అప్ర‌మ‌త్తం చేశాడు.

"ముఖ్యమైన హెచ్చరిక: ఉక్రెయిన్‌లోని కొన్ని ప్రాంతాలలో ప్ర‌స్తుతం రష్యాయేతర కమ్యూనికేషన్‌ల వ్యవస్థగా స్టార్‌లింక్ మాత్రమే పని చేస్తోంది. కాబట్టి, దాన్ని లక్ష్యంగా చేసుకొని ర‌ష్యా దాడుల‌కు తెగ‌బ‌డొచ్చు. దయచేసి జాగ్రత్తగా వాడండి" అని ఎలన్ మస్క్ ట్వీట్ చేశాడు. అవసరమైనప్పుడు మాత్రమే స్టార్‌లింక్‌ని ఆన్ చేయమని, యాంటెన్నాను వ్యక్తులకు వీలైనంత దూరంగా ఉంచమని, విజువల్ డిటెక్షన్‌ను నివారించడానికి యాంటెన్నాపై లైట్‌తో క‌వ‌ర్ చేయ‌మ‌ని కోరారు.

Tags:    

Similar News