జయా భాదురి తల్లి ఆరోగ్యంపై వదంతులు

సీనియర్ నటి, రాజ్యసభ సభ్యురాలు జయా భాదురి(Jaya baduri) తల్లి ఇందిరా భాదురి (94) అనారోగ్యంతో కన్ను మూశారంటూ పలు వార్తలు నెట్లో హాల్ చల్ చేశాయి.

Update: 2024-10-23 16:24 GMT

దిశ, వెబ్ డెస్క్ : సీనియర్ నటి, రాజ్యసభ సభ్యురాలు జయా భాదురి(Jaya baduri) తల్లి ఇందిరా భాదురి (94) అనారోగ్యంతో కన్ను మూశారంటూ పలు వార్తలు నెట్లో హాల్ చల్ చేశాయి. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె తుది శ్వాస విడిచారంటూ వదంతులు వ్యాపించాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని, ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని సమాచారం. ఈ వదంతులను నమ్మి అభిషేక్ బచ్చన్ భోపాల్ కు హుటాహుటిన భోపాల్ వెళ్లారు. ఇటీవల తన అమ్మమ్మ చిన్నపాటి వెన్నుముఖ సమస్యలతో బాధపడుతున్నప్పటికీ.. ప్రస్తుతానికి ఆమె క్షేమంగానే ఉన్నట్టు అభిషేక్ వెల్లడించారు. మరోవైపు భోపాల్ లోని ఇందిరా భాదురి కేర్ టేకర్ కూడా ఆమె బాగానే ఉన్నట్లు మీడియాకు తెలిపారు.


Similar News