Ruchira kamboj: అమ్మాయిలు ఏదైనా సాధించగలరు
Ruchira kamboj appointed as India's permanent Representative to United Nations| ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారి రుచిరా కాంబోజ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఐరాసలో భారత శాశ్వత రాయబారిగా ఆమె నియమితులయ్యారు. ఈ ఘనత సాధించిన మొదటి భారత మహిళగా నిలిచారు
వాషింగ్టన్: Ruchira kamboj appointed as India's permanent Representative to United Nations| ఐక్యరాజ్యసమితిలో భారత రాయబారి రుచిరా కాంబోజ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఐరాసలో భారత శాశ్వత రాయబారిగా ఆమె నియమితులయ్యారు. ఈ ఘనత సాధించిన మొదటి భారత మహిళగా నిలిచారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆమె బుధవారం ట్విట్టర్ ద్వారా సంతోషం వ్యక్తం చేశారు. 'ఈరోజు, ఐరాసకు శాశ్వత ప్రతినిధి/రాయబారిగా ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ గుటెర్రస్‌కు నా ఆధారాలను సమర్పించాను. ఈ పదవిని పొందిన తొలి భారతీయ మహిళ కావడం విశేషం. బయట ఉన్న అమ్మాయిలకు నేను చెప్పేది ఒకటే. మనమందరం ఏదైనా చేయగలము' అని ట్వీట్ చేశారు. 1987 ఐఎఫ్ఎస్ బ్యాచ్‌కు చెందిన రుచిరా గతంలో భూటాన్, దక్షిణాఫ్రికాలో భారత అంబాసిడర్‌గా పనిచేశారు. ఆ తర్వాత టీఎస్ తిరుమూర్తి స్థానంలో ఐరాసకు నియమితులయ్యారు. రెండు నెలల క్రితమే ఆమె నియామకం ఖరారు కాగా, తాజాగా మంగళవారం అందుకు సంబంధించిన పత్రాలను ఐరాస సెక్రటరీ జనరల్ అంటోనియో గుటెర్రస్‌కు సమర్పించారు.
ఇది కూడా చదవండి: ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ మాకు ప్రాణం పోసింది: Sri Lanka President