Ruchira Kamboj: ఐరాస భారత శాశ్వత ప్రతినిధిగా రుచిర కంబోజ్
Ruchira kamboj appointed As Permanent Representative Of India To United Nations| భారత విదేశాంగ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారి రుచిర కంబోజ్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.
న్యూయార్క్: Ruchira kamboj appointed As Permanent Representative Of India To United Nations| భారత విదేశాంగ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారి రుచిర కంబోజ్‌కు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి భారత శాశ్వత ప్రతినిధిగా మంగళవారం నియమించింది. ప్రస్తుతం భూటాన్‌లో భారత రాయబారిగా విధులు నిర్వహిస్తున్న కంబోజ్ టీఎస్ తిరుమూర్తి తర్వాత బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు త్వరలోనే ఆమె బాధ్యతలను స్వీకరించనున్నట్లు విదేశాంగ వ్యవహారాల శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.