''పోలీసు ఉద్యోగాలకు కనీస ఎత్తు 165Cm లకు తగ్గించాలి''
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలపై నిరుద్యోగుల ఎదురుచూపుల పర్వం కొనసాగుతుంది.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలపై నిరుద్యోగుల ఎదురుచూపుల పర్వం కొనసాగుతుంది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ 81 వేల ఉద్యోగాల ప్రకటన చేసినా, అధికారులు నోటిఫికేషన్ వేయడంలో జాప్యం చేస్తున్నారు. అయితే, నోటిఫికేషన్‌కు ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎదుట బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక డిమాండ్లు పెట్టారు. ''తెలంగాణలో 11 ఏండ్ల నుండి గ్రూప్-1 వెయ్యలేదు కాబట్టి పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి కనీసం 3-5 yrs పెంచాలి. అదేవిధంగా DSP ఉద్యోగాలకు కనీస ఎత్తు 167. 7 cm నుండి 165Cm లకు తగ్గించాలి. UPSCలో IPSలకు కుడా 165Cm లే కదా? 21వ శతాబ్దంలో ప్రాచీన కొలమానాలు ఎందుకు?'' అని ట్విట్టర్ వేదికగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
#Telangana లో 11 ఏండ్ల నుండి గ్రూప్ 1 వెయ్యలేదు కాబట్టి పోలీసు ఉద్యోగాలకు వయోపరిమితి కనీసం 3-5 yrs పెంచాలి .
— Dr. RS Praveen Kumar (@RSPraveenSwaero) March 12, 2022
అదేవిధంగా DSP ఉద్యోగాలకు కనీస ఎత్తు 167. 7 cm నుండి 165Cm లకు తగ్గించాలి .
UPSC లో IPS ల కు కుడా 165Cm లే కదా? 21st Century లో Tech Age లో కూడా ప్రాచీన కొలమానాలు ఎందుకు?