Bigg Boss-8 : ఎంటర్‌టైనర్స్‌ను విన్నర్స్‌లా చూడరు.. బిగ్‌బాస్‌లో రోహిణి, తేజా ఎమోషనల్ (వీడియో)

బిగ్‌బాస్ సీజన్ -8 (Bigg Boss-8) ప్రజెంట్ ఎంతో రసవత్తరంగా సాగుతోంది.

Update: 2024-11-02 15:45 GMT

దిశ, సినిమా: బిగ్‌బాస్ సీజన్ -8 (Bigg Boss-8) ప్రజెంట్ ఎంతో రసవత్తరంగా సాగుతోంది. ఇక వైల్డ్ కార్డ్ (Wild Card) ఎంట్రీస్ తర్వాత మరింత వైల్డ్‌గా మారిన హౌస్ మేట్స్ (Housemates).. వారిలో వారే కోపాలకు పోతూ గొడవలకు కాలు దువ్వుతున్నారు. మెగా చీఫ్ (Mega Chief) అయ్యేందుకు ఒక్కొక్కరు ఒక్కో రేంజ్‌లో వారి సత్తా చూపెడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా తానే ట్రోఫీ విన్నర్స్ (Trophy Winners) అన్నట్లుగా గేమ్స్ ఇరగదీస్తున్నారు. దీంతో.. గేమ్స్‌లోనే కాకుండా.. నార్మల్ టైమ్‌లో కూడా ఒకరికి ఒకరు శత్రువులుగా మారుతున్నారు.

ఇదిలా ఉంటే.. హౌస్‌లో గేమ్స్ పక్కన పెడితే బెస్ట్ ఎంటర్‌టైనర్స్ (Best Entertainers) గా రోహిణి (Rohini), అవినాష్ (Avinash), టేస్టీ తేజ (Tasty Teja) రాణిస్తున్నారు. ఓ పక్క గేమ్స్ ఆడుతూనే మరోవైపు హౌస్ మేట్స్‌తో సహా బిబి లవర్స్ (BB Lovers) ను కూడా ఎంటర్‌టైన్ (entertain) చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంటర్‌టైనర్స్‌ను విన్నర్స్‌లా చూడరు అంటూ రోహిణి, తేజ ఎమోషనల్ అయిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ మేరకు రోహిణి, తేజ మాట్లాడుకుంటూ.. ‘మన ఇంట్లో మనల్నీ టాప్ 5లో ఉంటారు అని అన్నారు ఏంటీ నాకు అర్థం కాలేదని’ తేజ అంటాడు. దానికి రోహిణి.. ‘మనకు ఎలాగో కప్ ఇవ్వరు కదా. మన పర్సనాలటీస్  (Personalities)కు కప్‌లు రావు’ అంటుంది. దానికి తేజ.. ‘ఎంటర్‌టైనర్స్‌ను ఎప్పుడు విన్నర్స్‌లా చూడరు’ అంటూ చెప్తాడు. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో ఎమోషనల్‌గా వైరల్ అవుతోంది.

Tags:    

Similar News