నా బాడీలో ఏ పార్ట్ చెక్కు చెదరలేదు.. బాలీవుడ్ బ్యూటీ
దిశ, సినిమా : బాలీవుడ్ హాట్ బ్యూటీ రిచా చద్దా వెయిట్‌లాస్, బ్యూటీనెస్పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా : బాలీవుడ్ హాట్ బ్యూటీ రిచా చద్దా వెయిట్‌లాస్, బ్యూటీనెస్పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. బ్లాక్ నెక్ లైన్‌తో కూడిన పొడవైన గౌను, రింగు రింగుల జుట్టు తో అట్రాక్ట్ చేస్తున్న ఫొటోలను నెట్టింట షేర్ చేసిన నటి.. ఓ స్పెషల్ నోట్ కూడా పంచుకుంది. 'ఫొటోగ్రాఫర్‌కు, నాకు మధ్య మంచి స్నేహం ఉంది. ఆయన ఆధ్వర్యంలో ఫోటో షూట్స్ చేయడమంటే చాలా ఇష్టం. ఈ షూట్ చేస్తున్నంతసేపు సంగీతం, నటన, ఇతర కళల పట్ల ప్రేమతో.. ఓ క్యారెక్టర్ పోషిస్తున్నట్లు గా అనిపించింది.
వీటితో పాటు మిమ్మల్ని డిస్టర్బ్ చేసే స్టిల్స్ కూడా క్యాప్చర్ చేశాం. వాటన్నింటినీ తొందరలోనే పోస్ట్ చేస్తాం. ధన్యవాదాలు' అని పేర్కొంది. ఇక బరువు తగ్గడం గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించిన రిచా.. ఆరోగ్యకర పద్ధతుల్లో బరువు తగ్గితే కండరాలు కోల్పోయే అవకాశం ఉండదని తెలిపింది. తన బాడీలో ఏ పార్ట్ చెక్కుచెదరకుండానే వెయిట్ తగ్గినట్లు చెప్పింది.