Revanth Reddy: మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి

Revanth Reddy Demands Government to support families of Died in Palamuru - Rangareddy Lift irrigation | నాగర్ కర్నూల్ జిల్లా పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో సంభవించిన ప్రమాదంపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన

Update: 2022-07-29 08:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: Revanth Reddy Demands Government to support families of Died in Palamuru - Rangareddy Lift irrigation| నాగర్ కర్నూల్ జిల్లా పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో సంభవించిన ప్రమాదంపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన బాధితుల కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ ప్రమాదానికి కారణమైన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. కొల్లాపూర్ మండలం రేగమనగడ్డ దగ్గర జరుగుతున్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనుల్లో క్రేన్ సాయంతో పంప్ హౌస్ లోకి దిగుతుండగా వైర్ తెగిపోవడంతో ఐదుగురు కూలీలు దుర్మరణం చెందారు. మృతుల్లో ముగ్గురు జార్ఖండ్‌కు చెందిన భోలేనాథ్ (45), ప్రవీణ్ (38), కమలేష్ (36), బీహార్‌‌కు చెందిన సోను కుమార్ (36), ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీను (40)గా గుర్తించారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ బీజేపీలోకి మాజీ ఐపీఎస్ అధికారి?

Tags:    

Similar News